పుష్ప సినిమా కొత్త అప్డేట్….?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ పుష్ప ‘ . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.అయితే బన్ని సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తున్న ఒక్క విషయం తప్ప ఇతర నటీనటులు గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు.ఈ సినిమా అప్డేట్ కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ చిత్ర యూనిట్ అతిత్వరలో ఒక అప్డేట్ ఇవ్వనుంది‌‌.

ఈ విషయాన్ని చిత్ర సంస్థ అయిన మైత్రీ మూవీస్ ట్వీట్టర్ ద్వారా చెప్పింది. దాంతో ఆ అప్డేట్ ఏం అయి ఉంటుంది అని అభిమానులు అప్పుడే గాసిప్స్ మొదలెట్టారు. ఒక వేళ అయితే విలన్ గా ఎవరు చేస్తున్నారో చెప్తారూ..? లేదా సినిమాలో కీలక పాత్ర ఏదైనా ఉంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి బయట ఇండస్ట్రీ నుండి ఎవరైనా లెజెండరీ యాక్టర్ పేరు రివీల్ చేస్తారు… అదీ లేకపోతే సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన ఫిక్స్ డేట్ చెప్తారు. మొత్తానికి ఏదేమైనా సాలిడ్ అప్డేట్ మాత్రం ఖాయం అనిపిస్తుంది. బన్నీ – సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి అంచనాలు మామూలు స్థాయిలో లేవు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: